
ధగధగ మెరిసే బంగారం రేటు భగ్గుమంటోంది.. పసిడి రేటు పరుగులు పెడుతోంది. ఇక శుక్రవారం అప్‌డేట్ చూస్తే బంగారం రేటు పెరిగింది. ఈ పెరుగుదల రేటు గత ఎనిమిది రోజులుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా మన మార్కెట్‌లో పసిడి ధర పైకి కదలడం గమనార్హం. మరోవైపు బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఇక కేజీ వెండి రు. 40 వరకు పెరిగింది. దీంతో వెండి ప్రస్తుతం రు. 41, 890 పలికింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు చూస్తూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరుగుదలతో రూ.45,970కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.140 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.42,100కు ఎగసింది. బంగారం ధర 8 రోజుల్లో రూ.2170 పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
విచిత్రం ఏంటంటే అంతర్జాతీయ విఫణిలో బంగారం రేటు తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.18 శాతం దిగొచ్చింది. దీంతో ఔన్స్‌కు 1729.70 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం పెరుగుదలతో 15.72 డాలర్లకు చేరింది.