అదేంటో.. బంగారం ధరలు గత 5 రోజులా నుండి భారీగా తగ్గుతూ వచ్చాయి.. అలాంటి ఈ బంగారం ధరలు ఇప్పుడు ఉన్నట్టుండి తగ్గుదలకు బ్రేకులు వేసి పెరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల్లో పెరిగింది బంగారం ధర.. అక్షయ తృతీయ.. తగ్గుతుంది.. అని.. లాక్ డౌన్ తర్వాత బంగారం కొనేయాలి అని అనుకునే వారందరికీ కూడా బంగారం పెద్ద షాక్ ఇచ్చింది.
గత 5 రోజులు కలిపి 2 వేలు తగ్గిన బంగారం ధర ఈ ఒక్క రోజే 600 రూపాయిలు తగ్గింది. నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 680 రూపాయిల పెరుగుదలతో 44,780 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 650 రూపాయిల పెరుగుదలతో 41,050 రూపాయలకు చేరింది.
ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 250 రూపాయిల తగ్గుదలతో 41,410 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.