బంగారం.. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ బంగారానికే తెలీదు.. కేవలం అంటే కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 12 వేలు పెరిగింది.. రోజు రోజుకు పెరుగుతున్న ఈ బంగారం ధర ఈమధ్యకాలంలో కరోనా వైరస్ కారణంగా మరి దారుణంగా పెరిగింది.. ఈ కరోనా కష్టకాలంలో బంగారం ధర ఏకంగా 6 పెరిగింది. 

 

బంగారం ధరలు ఇంత ఇంత పెరిగి ఇప్పుడు సామాన్యులు ఎవరు కొనలేని స్టేజికి చేరింది. ఇకపోతే నిన్న మొన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి.. బంగారం ఎప్పుడు ఒకేలా ఉండటం లేదు.. ఒకరోజు తగ్గుతుంది.. ఒక రోజు పెరుగుతుంది.. ఇలానే గత రెండు వారాలుగా కొనసాగుతుంది... మరి ఈరోజు బంగారం ధరలు ఎలా కొనసాగుతున్నాయి చుడండి.. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయ్. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 190 రూపాయిల పెరుగుదలతో 46,400 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 190 రూపాయిల పెరుగుదలతో 43,600 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు భారీగా పెరిగాయి.. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల పెరుగుదలతో 41,200 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఇలా బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ ఈ లాక్ డౌన్ కారణంగా ఎవరు కొనలేని స్థితి.. కాగా స్టాక్ మార్కెట్లు పూర్తి నష్టాల్లో కూరుకుపోవడంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: