ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వ్యాపారం రంగంలపై ఎంతగానో పడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం బంగారంపై కూడా పడిందని అంటున్నారు. ఇక  గత వారాంతంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో పెరుగుదల కనబరిచాయి. ఈరోజు (మే 4) బంగారం ధరలు దేశీయంగా కాస్త పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.43,600కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.46,400కు ఎగసింది. 

 

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా అదే దారిలో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కేజీకి 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కు వద్దకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,200 రూపాయల వద్దకు చేరింది. కాగా, ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం ధర కంటే 190 రూపాయల పెరుగుదల నమోదు చేసి 43,600 రూపాయలుగా నిలిచాయి.

 

ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 200 రూపాయల పెరుగుదలతో 46,400 రూపాయలు నమోదు చేసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.19 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1704.10 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం తగ్గుదలతో 14.89 డాలర్లకు క్షీణించింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: