
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో తెలియడం లేదు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతున్నాయి. కానీ ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.. కరోనా వైరస్ ప్రభావం కారణంగానే బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి..
ఇలా బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరిగితే ఇకపై సామాన్యులు కొనలేరు.. కానీ కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడటం.. అవి దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం నిజంగానే దారుణం.. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏకంగా సంవత్సరంలో 16 వేలు పెరిగింది. ఇలానే పెరిగితే పరిస్థితి ఏంటి?
ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం ధర ఇలా కొనసాగుతుంది.. ఇంకా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిల పెరుగుదలతో 46,900 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయిల పెరుగుదలతో 44,140 రూపాయలకు చేరింది.
ఇంకా వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 700 రూపాయిల పెరుగుదలతో 42,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.