
గత కొన్ని రోజుల నుంచి బంగారం రేట్లు పరుగులు పెడుతుంద.. మద్యలో వెల వెల బోతుంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర పరుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. తాజాగా పసిడి ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర తగ్గింది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 దిగొచ్చింది. రూ.44,200కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.47,000కు దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో నిన్న రూ.330 తగ్గిన బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. నేటి మార్కెట్లో రూ.10 ధర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,210కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,410 వద్ద ర్యాలీ అవుతోంది. పసిడి సంగతి ఇలా ఉంటే ఇక వెండి ధర మాత్రం తగ్గనంటుంది.
వెండి ధర రూ.43,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ మొదలైన్పటి నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు అన్నీ మూత పడి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని మార్కెటింగ్ రంగాలు ఢీలా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగంరా హెచ్చుతగ్గులుగా కొనసాగుతుంది.