బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందింది. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగివచ్చింది. ఇంకా పసిడితో పాటే వెండి ధర కూడా తగ్గింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి అనేది చూద్దాం.
నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయిల తగ్గుదలతో 50,480 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 180 రూపాయిల తగ్గుదలతో 46,270 రూపాయలకు చేరింది.
ఇంకా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 300 రూపాయిల తగ్గుదలతో 48,500 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల వద్ద కొనసాగుతుండగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
కాగా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గినప్పటికీ ఇక్కడ స్వల్పంగానే తగ్గుతున్నాయి. కాగా ఇలా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధర కేవలం ఒక్క సంవత్సరనికి ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది.