బంగారం ధర భారీగా తగ్గింది. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఈ బంగారం ధర ఇప్పుడు ఇంత తగ్గటానికి కారణం అంతర్జాతీయ మార్కెటే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ బంగారం ధర ఒక్క సంవత్సరంలో భారీగా పెరిగింది. కేవలం ఒక్క సంవత్సరంలో ఏకంగా 19 వేల రూపాయిలు పెరిగింది. ఇంకా ఇప్పటికి ఈ బంగారం ధర పెరుగుతూనే వస్తుంది. కానీ నేడు బంగారం ధరలు తగ్గాయి. ఎంత తగ్గినప్పటికీ సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉన్నాయి.             

 

నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల తగ్గుదలతో 50,840 రూపాయలకు చేరింది. ఇంకా అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల తగ్గుదలతో 46,230 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం ధరలు అన్ని భారీగా తగ్గాగా వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది.          

 

దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 500 రూపాయిల తగ్గుదలతో 48,000 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలతో కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల రూపాయిల వద్ద బంగారం కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47 వేలు వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే తగ్గుతూ కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు సామాన్యులకు అందే రేంజ్ కి ఎప్పుడు వస్తాయో చూడాలి.          

మరింత సమాచారం తెలుసుకోండి: