గత రెండు రోజులు భారీగా పతనమైన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిన ఈ బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయ్. అయితే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా ఉండటం వల్లే బంగారం ధరలు పెరిగాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.
నేడు హైదరాబాద్ లో మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల పెరుగుదలతో 51,240 రూపాయలకు చేరింది. ఇక అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల పెరుగుదలతో 49,960 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధర భారీగా పెరిగింది.
దీంతో నేడు కేజీ వెండి ధర 210 రూపాయిల పెరుగుదలతో 52,210 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. కాగా ఒక్క సంవత్సరంలో బంగారం ధరపై ఏకంగా 20 వేలకుపైగా పెరిగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటం వల్లే బంగారం ధర భారీగా పెరిగిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.