గత నాలుగు నెలలుగా పసిడి ధర పెరుగుతుంది.. తగ్గుతుంది. మరోవైపు వెండి రేటు సైతం హెచ్చుతగ్గులు అవుతూనే ఉంది.  ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బందులు పడుతున్నా... బంగారం మాత్రం తన ఉనికి కోల్పోకుండా మార్కెట్ లో ఊగీసలాడుతూ వస్తుంది.  నలభై వేల నుంచి యాభై వేల వరకు చేరింది.   కరోనా భయంతో శుభకార్యాలు కూడా తగ్గిన విషయం తెలిసిందే. 

 

నిన్న పెరిగిన పసిడి ధర ఈరోజు దిగొచ్చింది. ఈ నేపథ్యంలో బంగారం కొనేవారు ఇది కాస్త ఊరట ఇచ్చే విషయం అని అంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది... బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 క్షీణించింది. దీంతో ధర రూ.51,170కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.46,910కు క్షీణించింది.

 

మార్కెట్‌లో వెండి ధర రూ.880 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.53,000 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి కేజీ ధర రూ.53వేల మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.12 శాతం దిగొచ్చింది.  దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1811 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా తగ్గు ముఖం పట్టింది.    ఏది ఏమైనా కరోనా సమయంలో కూడా బంగారం రేటు మాత్రం పెరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: