చాలా మంది ఇప్పుడు కరోనా తో ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలిసిందే. శుభకార్యాలు ఒకప్పుడు ఎంత ఘనంగా జరిగాయో.. ఇప్పుడు అంత సైలెంట్ గా జరుగుతున్నాయి. కరోనా భయంతో చాలా మంది శుభకార్యాలు చేయడమే మానివేశారు. ఒకవేళ జరుపుకున్నా.. వారి కుటుంబ, అతి సన్నిహితుల ఆధ్వర్యంలోనే జరుపుకుంటున్నారు. అయితే శుభకార్యాలు.. ఇతర ఫంక్షన్లకు ఆడవారు బంగారం కొనుగోలు చేయడం సహజం.. అయితే కరోనా భయంతో కొనుగోలు శాతం తగ్గిందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇక్కడే అందరూ ఆశ్చర్యపోయే విధంగా బంగారం ధర చుక్కలనంటుకుంటూ వెళ్లింది. కరోనాకు ముందు కరోనా తర్వాత రేటులో చాలా వ్యత్యాసం వచ్చింది.
ప్రస్తుతం బంగారం ధర రూ.51 వేలకు పరుగులు తీస్తుంది. గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.180 మేర స్వల్పంగా బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ50,480కి తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,2700 అయింది. ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర నేడు రూ.150 మేర ధర తగ్గుదలతో ప్రారంభమైంది.
దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,300అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర తగ్గడంతో 10 గ్రాములు రూ.47,100కి దిగొచ్చింది. నేడు బంగారం ధరలు దిగిరాగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు వెండి ధర రూ.50 మేర పెరగడంతో మార్కెట్ మొదలైంది. వెండి 1 కేజీ ధర రూ.48,550కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.