కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సమయం లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమని అందరూ భావిస్తున్నారు. అయితే, బంగారం పెట్టుబడి పెట్టే విషయానికి వచ్చేసరికి డిజిటల్ బంగారం పై పెట్టుబడులు పెట్టాలా లేకపోతే బాహ్యప్రపంచంలో కళ్ళతో ప్రత్యక్షంగా చూసే బంగారంపై పెట్టుబడులు పెట్టాలా అని చాలా మంది ఇంకా ఆలోచిస్తున్నారు. నిజమేమిటంటే నేటి సమాజంలో చాలా కాలం నుండి డిజిటల్ బంగారంపై పెట్టుబడులు పెట్టడం విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. ఇప్పుడు మీరు ఒక్క రూపాయి కంటే తక్కువ పెట్టుబడి పెట్టి 999.9 ప్యూరిటీ సర్టిఫైడ్ బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.
ఒక్క రూపాయి తో ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలి?
MMTC-PAMP డిజిటల్‌గా యాక్సెస్ చేయగల ప్రపంచంలోని మొట్టమొదటి బంగారు ఖాతాలలో ఒకటని చెప్పుకోవచ్చు. మీరు డిజిటల్ బంగారం కొనుగోలు చేసుకోవాలన్న యోచనలో ఉన్నట్లయితే... మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే... MMTC-PAMP ద్వారా 999.9 ప్యూరిటీ సర్టిఫైడ్ బంగారాన్ని కేవలం 1 రూపాయల కన్నా తక్కువకు విక్రయించవచ్చు, కొనుగోలు చేయవచ్చు, రిడీమ్ చేయవచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక కస్టమర్ అమ్మడం, కొనడం అనేది అంతర్జాతీయ రేట్లతో అనుసంధానించబడిన ప్రత్యక్ష ధరలకు సంవత్సరానికి 365 రోజులలో ఏరోజైనా చేసుకోవచ్చు.
MMTC-PAMP డిజిటల్ గోల్డ్ సంస్థ తమ వినియోగదారులకు తక్కువ సైజు బంగారాన్ని కొనుగోలు చేయడానికి, దాచి పెట్టుకోవడానికి ఆపై నేరుగా భౌతిక డెలివరీ కోసం అభ్యర్థించడానికి ఒక బ్రహ్మాండమైన వెసులుబాటును కల్పిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన పేటీఎం, గూగుల్ పే, ఫిస్డమ్‌తో పాటు మోతీలాల్ ఓస్వాల్ వంటి ఆర్థిక సంస్థలలో కూడా ఈ సేవ అందుబాటులో ఉంది.
డిజిటల్ బంగారం కొనడం వలన ఏమైనా రిస్క్ ఉంటుందా?
MMTC-PAMP డిజిటల్ బంగారం సంస్థ లో బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది చాలా సురక్షితమని ఆ సంస్థ తెలుపుతుంది. కొనుగోలు చేసిన ప్రతి గ్రాము యొక్క డిజిటల్ బంగారం కొరకు... MMTC-PAMP భౌతిక బంగారం యొక్క సమానమైన నాణ్యత, పరిమాణాన్ని తమ వద్ద నిల్వ చేస్తుంది. అలాగే ప్రతి కస్టమర్లు కొనుగోలు చేసిన బంగారం కట్టుదిట్టమైన భద్రత కలిగివున్న ఖజానాలో సంరక్షించబడుతుంది. దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా...ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్ సెక్యూరిటీ బీమా సౌకర్యం కల్పిస్తుంది.