భారత మార్కెట్ పసిడి ధర పైపైకి ఎగబాకింది. పరుగులు పెడుతూ దూసుకుపోతుంది. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. బంగారం ధర భగ్గుమంటోంది. 50వేలు దాటి పసిడి ధర పరుగులు తీస్తోంది. అటు వెండిది కూడా అదే దారి. తొలసారిగా వెండీ రికార్డు స్థాయిలో 60వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్ లోనూ పసిడి ధర పైపైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. 

 

హైదరాబాద్ నగర మార్కెట్ లో కూడా పసిడి ధర పెరిగింది.  గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,110గా . కేరళ, బెంగుళూరులో కూడా బంగారం ధర 50వేలు దాటింది.

 

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి పరుగులు తీస్తుంటే.. వెండి పసిడి దారిలోనే నడిచింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర గరిష్టంగా వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది.

 

మొదటి నుంచే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్ బంగారం రేటు పెరిగినా దేశీయ మార్కెట్ బంగారం ధర తగ్గింది. కానీ ఇప్పుడు బంగారం ధర ఔన్స్ కు 0.16 శాతం పెరిగింది. దీంతో పసిడి ధర ఔన్స్ కు 1846 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా వెండి గణనీయంగా పెరిగింది. వెండి ధర ఔన్స్ కు 6.67 శాతం పెరగడంతో 22.99 డాలర్లకు ఎగసింది.

 

భారత రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర పైపైకి ఎగిసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.51,380కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.110పెరగడంతో రూ.49,110గాకు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా గరిష్టంగా పెరుగుదల చూపింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3502 పెరుగుదలతో రూ.60,844కు చేరిందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: