ఇక తాజాగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 రూపాయలు పెరిగి రూ. 55,820 కు చేరుకుంది. ప్రస్తుతం ఈ ధర ఆల్టైమ్ గరిష్టస్థాయి. ఇంకా అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10 గ్రాములు రెండు వందల ఇరవై రూపాయలు పెరిగి 51,250 రూపాయలకు చేరుకుంది. ఈ ధరలు వరుసగా పెరగడం పదవరోజు.
ఇక బంగారు దారిలోనే వెండి ధర కూడా పెరుగుతూ వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి మంచి డిమాండ్ రావడంతో వెండి ధర అమాంతం పెరిగింది. తాజాగా ఒక్కరోజే రెండు వేల రూపాయలు పెరిగి ఏకంగా 65 వేల రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి ధర కేజీ 5.4 శాతం పెరిగి 24.62 డాలర్లకు చేరుకుంది. వీటి ధరలు పెరగడానికి గల కారణాలు అంతర్జాతీయంగా చాలామంది స్థిరాస్తులు, బంగారం లాంటి వాటిపై పెట్టుబడులు పెట్టడం వల్ల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.