బంగారం వెండి ధరలు రోజురోజుకీ సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఎంసిఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే 10 గ్రాముల బంగారం ధర 1.7% ఎగబాకి రూ. 54, 612 కు చేరుకుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఫీచర్స్ 6.4 శాతం ఎగిసి కిలో రూ. 69, 962 కు చేరుకుంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర ఇబ్బంది పెడుతుంటే.. మరోవైపు ఈ బంగారు వెండి ధరలు అమాంతం పెరుగుతూ వెళుతున్నాయి. ఇక కేవలం ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి నేటి వరకు 35 శాతం మేర బంగారం వెండి ధరలు పెరిగాయి.


ఇక తాజాగా బంగారం, వెండి ధరలు నేడు కూడా సరికొత్త రికార్డును సృష్టించాయి. నేడు ఒక్క రోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 930 రూపాయలు పెరిగి రూ. 53, 010 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1010 పెరిగి ఆల్ టైం గరిష్టం రూ. 57,820 లకు చేరుకుంది. బంగారం కాస్త నిదానంగా పెరుగుతుంటే... వెండి ధర మాత్రం రాకెట్ కంటే వేగంగా పయనిస్తోంది. నేడు ఒక్కరోజే కేజీ బంగారం ధర రూ. 6450 రూపాయలు పెరిగి రూ. 71,500 కు చేరుకుంది.



ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఔన్స్ పసిడి ధర 0.6 శాతం పెరిగి 2021 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి 0.05 శాతం పెరిగి 26 డాలర్లకు చేరుకుంది. మొత్తానికి బంగారం ధరలు కేంద్ర బ్యాంకు లో బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, గ్లోబల్ పసిడి మార్కెట్లో ధరల మార్పులు లాంటి వివిధ అంశాలు ఆధారపడి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: