
అయితే ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధర 10 గ్రాములు రూ.56వేల కంటే పైకి పలికింది. శుక్రవారం రూ.52,000కు కాస్త పైన చేరిందని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల గరిష్టం నుండి రూ.4,000 కంటే ఎక్కువగా ధర తగ్గిందని తెలిపారు. ఇక పసిడి ధరలపై కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు డాలర్ వ్యాల్యూ, అంతర్జాతీయ మార్కెట్లు, ఫెడ్ నిర్ణయాలు, అమెరికా-చైనా ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితులు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు ప్యాకేజీపై కూడా ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.
భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్థిరంగా నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో ధర రూ.55,610కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గడంతో రూ.51,010కు చేరింది. ఇక కేజీ వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. 10 గ్రాముల వెండిధర రూ.671 పెరగడంతో రూ.67,100 కు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.55, 070, 22 క్యారెట్ల బంగారం రూ.50,490 గా ఉందని నిపుణులు వెల్లడించారు.