గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. దీంతో పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,370కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,350 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.51,570కి చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.47,300కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,150. 24 క్యారెట్ల ధర రూ.50,400 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గింది. ఇక మార్కెట్ లో వెండి ధర పెరిగింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.2300 పెరగడంతో ధర రూ.59,300కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరగడంతో ధర రూ.53,190కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గడంతో రూ.48.800కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధరలో రూ.2300 పెరగడంతో ధర రూ.59,300కు చేరింది.