దేశీయ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటి రోజు అమాంతం తగ్గిన బంగారం ధర ఈ రోజు స్వల్పంగా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. బుధవారం నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 పెరగడంతో ధర రూ.52,360కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరగడంతో రూ.48,000కి చేరింది.

గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గతూ వచ్చి స్వల్పంగా పెరుగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,450 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.51,700, 22 క్యారెట్ల ధర రూ.47,400కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,500. 24 క్యారెట్ల ధర రూ.50,740 గా ఉంది.

దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా కొనసాగినా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతూ తగ్గతూ వచ్చి ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.800 పెరగడంతో ధర రూ.61,000కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,340కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరగడంతో రూ.48,900కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.800 పెరగడంతో ధర రూ.61,000కు చేరింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగిన వెండి ధర ప్రస్తుతం భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: