పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నేడు బంగారం ధర కాస్త దిగివచ్చి కొంత ఉపశమనం కల్గించాయి. బంగారం ధర మాదిరిగానే వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. వెండి ధర కూడా భారీగానే దిగి వచ్చింది. అటు గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర దిగి రావటంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వెలవెలబోయాయి. బంగారం ధర దిగి రావటంతో.. పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించే విషయమని చెప్పచు. ఇటు బంగారం ధరలు  తగ్గటంతో, వెండి ధర కూడా ఇదే బాటలో పయనం అయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో ఈ వారం బంగారం ధర కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి  ధర రూ.370 తగ్గటంతో  రూ.53,310 నుంచి రూ.52,940కు పడిపోయింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.340 పడిపోవడంతో, పసిడి ధర రూ.48,870 నుంచి రూ.48,530కు తగ్గింది. ఇటు పసిడి ధరలు దిగిరావటంతో వెండి ధర కూడా ఇదే దారిలో పయనం అయింది. కేజీ వెండి ధర రూ.2,200 పతనమైంది. దీంతో వెండి ధర రూ.63,800 నుంచి రూ.61,600కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గటమే  ఇందుకు గల ప్రధాన కారణంగా చెప్పుకోస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ఈ వారం పసిడి ధరలు పెరిగాయి. బంగారం ధర ఔన్స్‌కు 1895 డాలర్ల నుంచి 1902 డాలర్లకు చేరాయి. బంగారం ధరలు పెరగగా వెండి ధర మాత్రం దాదాపుగా అదే ధరలో ముగిసిందని చెప్పుకోవచ్చు. వెండి ధర మాత్రం ఔన్స్‌కు 24.28 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ఇటు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ లో  పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి  అంశాలుపై బంగారం ధరలపై భారీ  ప్రభావం చూపుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: