హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పసిడి ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,870 తగ్గటంతో రూ.51,070కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,710 పతనమై బంగారం ధర రూ.46,820కు తగ్గింది. ఇక్కడ పసిడి ధర పడిపోగా వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరగటంతో వెండి ధర రూ.61,700 అయింది. ఇందుకు గల ప్రధాన కారణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో పలు మార్పులు , కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. జాతీయ మార్కెట్లో ఇలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం దిగిరావటంతో 1903 డాలర్లకు చేరింది.