బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పరుగులు తీసిన సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ సమయంలో 40 వేల లోపు ఉన్న పది గ్రాములు బంగారం రేటు ఒక్కసారిగా 60 వేలకు వచ్చింది. తర్వాత కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు అయితే గంట గంటకు ధరలో మార్పులు కలుగుతున్నాయి. నిన్న వరకు భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం రేట్లు ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. బంగారం ధర పెరిగినా, తగ్గినా కూడా
వెండి ధర కూడా అదే దారిలో పయనిస్తుంది. ఈరోజు బంగారం రేట్లు చాలా వరకు తగ్గిందని తెలుస్తుంది..
గ్లోబల్
మార్కెట్ లో బంగారం ధర పెరిగిన విదేశీ
మార్కెట్ లో బంగారం ధర భారీగా పడిపోవడంతో ఇప్పుడు కొద్దిగా ఊరట కలుగుతుంది. హైదరాబాద్ లో బంగారం ధర భారీగా తగ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.780 తగ్గుదలతో రూ.50,950కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 క్షీణించింది. దీంతో ధర రూ.46,700కు పడిపోయింది.
బంగారం దారిలోనే
వెండి కూడా పయనిస్తుంది.బంగారం పెరిగితే ,
వెండి కూడా పెరుగుతుంది. ఈ మేరకు ప్రస్తుతం బంగారం ధర భారీగా పడిపోవడంతో
వెండి ధర కిందకు వచ్చింది .. ప్రస్తుతం కేజి
వెండి ధర రూ.750 దిగొచ్చింది. దీంతో
వెండి ధర రూ.62,000కు పడిపోయింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో
వెండి ధర కూడా తగ్గింది. ఇంకోవైపు విదేశీ
మార్కెట్ లో బంగారం ధర పరుగులు పెడుతుంది.ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1919 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్ కు 0.50 పెరగడం తో 25.10 డాలర్లకు పెరిగింది.
దసరా పండుగ వేళల్లో బంగారం ధర పూర్తిగా తగ్గుతుందని సమాచారం..