
బంగారం నిల్వలు, విదేశీ మార్కెట్ లో ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ఇవన్నీ కూడా బంగారం ధర ల పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ధరలు కిందకు దిగి వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు పసిడి రేట్లు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గుదలతో రూ.51,650కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.70 తగ్గింది. దీని వల్ల ఇప్పుడు రూ.47,340 కు పడిపోయింది.
బంగారు ధర ల పై వెండి రేట్లు కూడా పయనిస్తున్నాయి. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.500 పెరిగింది. దీంతో వెండి ధర రూ.65,200కు చేరింది. బంగారం ధర ఔన్స్‌కు 0.57 శాతం పెరుగుదలతో 1878 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.5 శాతం పెరుగుదలతో 23.71 డాలర్లకు పెరిగింది. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు ఇలా కొనసాగుతున్నాయి. వెండి కి మార్కెట్ డిమాండ్ భారీగా పెరగడంతో ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. రేపటి వెండి ,బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..