అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పూర్తిగా తగ్గాయని నిపుణులు అంటున్నారు. నిన్నటి ధరతో పోలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గుదలతో రూ.51,550కు క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు రూ.340 తగ్గింది. దీంతో ధర రూ.47,250కు పడిపోయింది. ఈరోజు విషయానికొస్తే కాస్త ఎక్కువగానే పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.51,920కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,600కు ఎగసింది.
గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కిలో వెండి ధర మాత్రం ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.. ఏకంగా కిలో ధర మీద 700 తగ్గింది. రూ.66,300కు క్షీణించింది. వస్తువుల తయారీ.. విక్రయాలు పూర్తిగా తగ్గిపోవడంతో వెండి రేట్లు కిందకు దిగాయి..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఈరోజు ఉరుకులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరుగుదలతో 1905 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 24.03 డాలర్లకు పెరిగింది. .. మొత్తానికి మళ్లీ బంగారం రేట్లు పెరిగేలా ఉన్నాయని అంటున్నారు ..