భారత దేశంలో పండగల సీజన్ లో వస్తువుల కొనుగోళ్లు మాత్రం భారీగా  పెరిగాయి.. అంతేకాదు కంపెనీలు కూడా వాటికి తగ్గట్లు ఆఫర్లను కూడా కంపెనీ వాళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక మరో విషయమేంటంటే కరోనా వ్యాక్సిన్ కూడా హైదారాబాద్ కు వచ్చిందని అంటున్నారు. మొత్తానికి తెలుగు వాళ్లకు గుడ్ టైం నడుస్తుంది. కానీ బంగారం ధరలు మాత్రం కాస్త ఆందోళన కరంగా మారాయి.. గత రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం రేట్లు ఈరోజు భగ్గుమంటున్నాయి.. భారీగా ధరలు పెరిగాయి.. ఒక్కసారిగా ధరలు పైపైకి రావడంతో పసిడి ప్రియులకు మింగుడు పడటం లేదు..



అంతర్జాతీయ మార్కెట్ లో ఈరోజు రేట్లు కాస్త ఆందోళన కరంగా మారింది. నిన్న రోజు బంగారం ధరలు భారీగా తగ్గింది..కానీ ఈరోజు మాత్రం రేట్లు పెరిగాయి.. నిన్న రేట్లు ఏకంగా 2000 వరకు తగ్గింది. కానీ ఈరోజు రేట్లు మాత్రం కాస్త పైపైకి పెరిగింది. ఈరోజు రేట్లు చూస్తే.. హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు విషయానికొస్తే.. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.51,490కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,200కు ఎగసింది.



బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.900 పెరుగుదలతో వెండి ధర రూ.62,800కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది.బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 1860 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.02 క్షీణతతో 24.20 డాలర్లకు దిగొచ్చింది.. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు అనేక అంశాలు బంగారం ధరలు ఆధారపడుతున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: