ఈరోజు హైదరాబాద్ మార్కెట్ బంగారం ధరలు విషయానికొస్తే..పసిడి పరుగులు పెడుతూనే ఉంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ ధరలు చుక్కలను చూపిస్తున్నాయి.. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పైకి కదిలింది. రూ.52,050కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.260 పెరుగుదలతో రూ.47,710కు బంగారం ధరలు పెరగడం అనేది రెండో రోజు కూడా కొనసాగడం గమనార్హం..
పసిడి ధరలు పెరిగితే వెండి ధరలు పెరుగుతున్నాయి.. కానీ గత కొన్ని రోజులుగా వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి..రూ.290 పెరుగుదలతో వెండి ధర రూ.63,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.17 శాతం పెరుగుదలతో 1889 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.52 శాతం పెరుగుదలతో 24.90 డాలర్లకు పెరిగింది కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి అంశాల వల్ల బంగారం రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు..