ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 క్షీణించింది. రూ.51,930కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేవలం రూ.100 తగ్గుదలతో రూ.47,600కు తగ్గింది.. మొన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు కిందకు దిగొచ్చాయి.బంగారం ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.. రూ.300 తగ్గుదలతో వెండి ధర రూ.68,100కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం తో పాటుగా వెండి వస్తువులు, ఆభరణాల పై డిమాండ్ భారీగా తగ్గడంతో ఇప్పుడు రేట్లు ఊరటను కలిగిస్తున్నాయి..
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 1878 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 24.53 డాలర్లకు తగ్గింది..ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు తగ్గడంతో బంగారం రేట్లలో రోజు రోజుకు వ్యత్యాసం కలుగుతుంది.. రేపటికి ఈ రేట్లు ఎలా ఉంటాయో చూడాలి.. బంగారం ధరలు పెరిగిన తగ్గిన కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారు..