పసిడి ధరలకు మార్కెట్ లో ఈరోజు బ్రేకులు పడ్డాయి.. గత వారం నుంచి రేట్లు కిందకు వస్తున్నాయి. దీపావళి నుంచి బంగారం ధరలకు పూర్తిగా గిరాకీ తగ్గింది.. ఇకపోతే ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కార్తీక మాసాల్లో ఇది శుభవార్త అనే చెప్పాలి..ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కొనసాగుతున్న రేట్లు ఉపశమనం కలిగిస్తున్నాయి..బంగారం ధర దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..



ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరల విషయానికొస్తే..విదేశీ మార్కెట్ లో రేట్లు పెరిగిన కూడా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వచ్చాయి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 పడిపోయింది. రూ.49,100కి క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.440 తగ్గుదలతో రూ.45,010కు చేరింది..బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి..



ఈరోజు మార్కెట్ లో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.. నిన్న ఎంత రేట్లు ఉన్నాయో.. ఇప్పటికీ అంతే ధర ఉంది.వెండి ధర రూ.64,700 వద్దనేు స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అలానే కొనసాగడంతో  వెండి ధరలో ఏ మాత్రం మార్పు లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 1800 డాలర్ల కిందనే కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1785 డాలర్లకు పడిపోయింది. బంగారం దారిలోనే వెండి కూడా నడిచింది.వెండి ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 22.61 డాలర్లకు పడిపోయింది.. జనవరిలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. మరి ఏ మాత్రం తగ్గుతుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: