
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ.46,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 పెరిగి రూ.50,400కి చేరింది. ఇక నిన్నటి రోజున భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. ఇక ఈరోజు కూడా అదే విధంగా వెండి ధరలు పైకి కదిలాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 68,900కి చేరింది.
వెండి తో తయారు చేసే వస్తువుల పై డిమాండ్ పెరగడంతో ఈరోజు భారీగా పెరిగింది. ఇక పోతే బంగారం, వెండి వస్తువుల వినియోగం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ వెండి, బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు ధరలను చూస్తే..కూడా బంగారం ధర జిగేల్ మంది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 1845 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరుగుదలతో 24.21 డాలర్లకు చేరింది.. వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు..