బంగారం ధరలు తగ్గుతాయా అని ఆశలు పెట్టుకోవడం వృద్ధా ప్రయాస అని చెప్పాలి..
డిసెంబర్ 1 నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న రేటుతో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగాయి. గత వారం పది రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. దీంతో బంగారం కొనాలని అనుకునేవాళ్లు కూడా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షాక్ ఇస్తున్న ధరలను చూసి ప్రజలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఓ మాదిరిగా ఉన్నా కూడా
ఇండియన్ మార్కెట్ లో రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.
హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. రూ. 450 పెరిగి.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 51,050కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారానికి రూ.400 పెరిగడంతో 10 గ్రాముల పడిసి రూ. 46,800 లకు జంప్ అయ్యింది. ఇక
న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్
పసిడి ధర 1888 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. స్పాట్ మార్కెట్‌లో చూసుకుంటే 1,882 డాలర్లు పయనించింది.
వెండి ధర విషయానికొస్తే.. కిలో
వెండి ధర రూ.700 పెరగడంతో.. దేశంలో
వెండి ధర రూ.67,700కు చేరింది.
హైదరాబాద్, విశాఖపట్నం మార్కెట్లలో కిలో
వెండి ధర రూ. 71,500 ఉంది. ఈ నాలుగు రోజుల్లోనే
వెండి ధర రూ.4500 పెరగడంతో నిజంగా చర్చనీయాంశంగా మారింది.
వెండి వస్తువులకు
మార్కెట్ లో డిమాండ్ పెరగడం ఒకవైపు, వస్తువుల తయారీ పుంజుకోవడంతో ఈ రేట్లు పైకి కదిలాయని
మార్కెట్ నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఈరోజు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కూడా మార్కెట్లో గోల్డ్ , సిల్వర్ వస్తువుల డిమాండ్ మాత్రం తగ్గలేదు..
జనవరి లో పూర్తిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బంగారు ధరలు కొంతవరకు అయిన తగ్గుతాయేమో చూడాలి..