అంతర్జాతీయ మార్కెట్ తో పాటుగా , దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఎగసిపడ్డాయి.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ బంగారం ధరలను చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి కదిలింది. రూ.50,940కు చేరింది. ఇక పోతే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పెరుగుదలతో రూ.46,700కు ఎగసింది. ఒక్కసారిగా రేట్లు భారీ స్థాయిలో పెరగడంతో షాపులు ముందు జనాలు లేరని తెలుస్తుంది.
బంగారం ధరల మీదే వెండి ధరలు కూడా ఆధారపడిన సంగతి తెలిసిందే..మొన్నటి దాకా బంగారాన్ని మించిన రేంజులో వెండి ధరలు ఉరుకులు పెట్టాయి..ఈరోజు కూడా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.వెండి రేటు రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.71,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 1883 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 25.94 డాలర్లకు చేరింది..అయితే బంగారం ధరలు మాత్రం రోజు ఒకేలా ఉండవని తెలుస్తుంది.. మున్ముందు ఎలా ఉంటాయో చూడాలి..