నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం రేట్ల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,930 ఉంది. ఇకపోతే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 రూపాయలు తగ్గి రూ.46,690 కు పడిపోయింది. బంగారం ధరలు స్వల్పంగా ఉంటే..వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి రేటు రూ.200 తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
విదేశీ మార్కెట్లో బంగారం ధరలు నిన్న భారీగా పెరిగిన సంగతి తెలిసిందే..బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 1883 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 25.94 డాలర్లకు పెరిగింది.బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్ వంటి అంశాలు బంగారం రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి. వచ్చే ఏడాది మొదటి నెల నుంచి పసిడి ధరలు పూర్తిగా కిందకు వస్తాయి అంటూ నిపుణులు అంటున్నారు.. కొత్త రకం కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ధరలు ఏం తగ్గుతాయో అని వార్తలు వినిపిస్తున్నాయి