పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి..మొన్నటి వరకు పైకి కదిలిన ధరలు నేటి మార్కెట్ లో వెల వెల బోతున్నాయి..బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరల రేట్ల పై వెండి రేట్లు కూడా ఆధారపడి పయనిస్తున్నాయి. దగ్గరలో నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..



హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలను పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 దిగొచ్చింది. రూ.50,940కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 క్షీణతతో రూ.46,700కు తగ్గింది. బంగారం తగ్గితే వెండి కూడా తగ్గుతూ వస్తోంది.. ఈ మేరకు ఈరోజు మార్కెట్ లో వెండి ధర కిలో కు .2500 తగ్గింది. దీంతో వెండి ధర రూ.71,200కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రధాన కారణమని తెలుస్తోంది.


బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు , మార్కెట్ లో బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గడం వంటి వాటి వల్ల రేట్లు పూర్తిగా కిందకు దిగి వస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1886 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 25.98 డాలర్లకు పెరిగింది.. కొత్త సంవత్సరంలో గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: