బంగారం ధరలు ప్రజలను ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. దీంతో ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది.తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెట్టే కంపెనీల వారు సహజంగానే ధరలు పెరుగుతున్నాయనీ, పెట్టుబడులు పెట్టమని ఎంకరేజ్ చేస్తారు. ఐతే... వాస్తవం ఏంటన్నది మనం తెలుసుకొని తీరాలి. లేదంటే అడ్డంగా బుక్కైపోతాం...

నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు  భారీగా పుంజుకుంటున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధరలు కాస్త పెరిగాయని చెప్పవచ్చు.

22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు  46,200 ఉంది. నిన్నటితో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగింది.24 క్యారెట్ల మేలిమి బంగారం  ధర ప్రస్తుతం 10 గ్రాములకు 50,400 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ  కూడా  ధరలో ఎలాంటి మార్పు లేదు.ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారo ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-46,200, విశాఖ-46,200 , విజయవాడ-46,200, ముంబై-48,460, చెన్నై-46,620, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-46,200, కోల్‌కతా-48,990.ఇక ఇవాళ్టి  కేజీ వెండి ధర రూ.70,700 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర కాస్త పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.707 ఉంది. వెండి ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.707, విజయవాడ-707, విశాఖ-707, ముంబై-663, చెన్నై-703, న్యూఢిల్లీ-663, బెంగళూరు-665, కోల్‌కతా-రూ.663. గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.500 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,300 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.300 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,700కు చేరింది.   బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో ధర తగ్గినప్పుడు కొంతమేర పుత్తడిని కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: