పసిడి ప్రియులకు చేదు వార్త.. ప్రస్తుత మార్కెట్ లో గోల్డ్ రేట్లు ఈరోజు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం బంగారం రేట్లు ఓ మాదిరిగా తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అయితే నిన్న మీద పోలిస్తే ఈరోజు మరి కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. పండగ సీజన్ కనుక కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రజలు భావిస్తున్నారు. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.. వెండి ధరలు మాత్రం పైకి పెరిగి పోయాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 46,000 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 280 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,180 రూపాయలుగా నమోదు అయింది. శనివారం ధరలు షాకి స్తున్నాయి.



బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్ లో వెండి ధరలు పైకి కదిలాయి. మొన్నటి దాకా బంగారాన్ని మించిన రేంజులో  వెండి ధరలు ఉరుకులు పెట్టాయి..ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 70వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 70,600 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1878 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. వెండి ధర ఔన్స్‌కు 0.42 తగ్గుదలతో 24.36 డాలర్లకు క్షీణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: