అంతర్జతీయ మార్కెట్ ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్ మార్కెట్ లో ధరను పరిశీలిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.50,120 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. రూ.45,940 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో వెండి ధర రూ.71,300 వద్దనే ఉంది.
మొదటి నుంచి బంగారం ధరల పైనే వెండి ధర
ఆధారపడుతుంది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిన కూడా వెండి ధరల లో ఎటువంటి మార్పులు లేక పోవడం గమర్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1853 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.46 శాతం క్షీణతతో 25.36 డాలర్లకు తగ్గింది.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.