పసిడి కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. బంగారు ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. బంగారం కొనేవాల్లకు ఈరోజు ఊరట కలిగించే వార్త అనే చెప్పాలి.. నిన్న పెరిగిన ధరలు నేటి
మార్కెట్ లో కిందకు కదిలాయి.. బంగారం ధర తగ్గితే..
వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం,
వెండి ధరలు దిగి రావడంతో దేశీయ
మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. నిన్నటి రోజుతో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్లు కూడా ఈరోజు పెరిగాయని బులియన్
మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు కూడా తగ్గాయి.. ఇకపోతే
హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరలను చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 దిగొచ్చింది. దీంతో రేటు రూ.49,900కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 క్షీణించింది. రూ.45,750కు దిగొచ్చింది.. అదే విధంగా
వెండి ధరలు నడిచాయి. కేజీ
వెండి ధర రూ.600 పడిపోయింది. దీంతో
వెండి ధర రూ.70,700కు క్షీణించింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు..
ఇక
అంతర్జాతీయ మార్కెట్ లో ఈరోజు రేట్లు విషయానికొస్తే.. బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.65 శాతం తగ్గుదల తో 1833 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే
వెండి ధర కూడా ఇదే దారి లో నడిచింది. ఔన్స్‌కు 1 శాతం క్షీణత తో 25.13 డాలర్లకు చేరింది. ఇక బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు . రేపటి రోజు ఈ ధరలు పెరుగుతా యో, తగ్గుతా యో చూడాలి.. మొత్తానికి ఈరోజు ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు.. కొనుగోళ్లు కూడా పెరిగాయి..