గత మూడు రోజులుగా బంగారం పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి.అకస్మాత్తుగా పెరిగిన ధరలు రోజు రోజుకు షాక్ ఇస్తున్నాయి.. నిన్న ఓ విధంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు స్థిరంగా ఉండటంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి కూడా తగ్గుతూ వస్తోంది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే ధరతో కొనసాగడం గమనార్హం..



అంతర్జతీయ మార్కెట్ నిన్నటి వరకు తగ్గాయి. దేశీయ మార్కెట్ లో ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో ధరను పరిశీలిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర స్థిరంగా ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.49,800కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణించింది. రూ.45,650కు చేరింది. వెండి ధర నిన్న ఏకంగా రూ.4,700 పతనమైంది. దీంతో వెండి ధర రూ.66,000కు క్షీణించింది. ఈరోజు 200 పెరిగి 66,200 వద్ద కొనసాగుతుంది.



ఇకపోతే రోజుకో విధంగా మారుతున్న బంగారం ధరల పై ప్రజలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది..
బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు మార్కెట్ లో చాలానే ఉన్నాయి. వాటి విషయానికొస్తే.. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, కొత్త ఆభరణాలు తయారు అవ్వక పోవడం వంటి అంశాలు రోజువారీ మార్కెట్ ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి..కాగా, అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర ఔన్స్‌కు 1.05 శాతం పెరుగుదలతో 1902 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 3.87 శాతం పెరుగుదలతో 26.45 డాలర్లకు పెరిగింది..ఆదివారం రోజు బంగారం ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: