
ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 పడిపోయింది. దీంతో రేటు రూ.49,640 కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,500 కు తగ్గింది. బంగారం ధర వెల వెలబోతే.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.79,200 కు దూసుకెళ్లింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1862 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.66 శాతం తగ్గుదల తో 28.92 డాలర్లకు తగ్గాయి. బంగారం ధరలు, వెండి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు మొదలైన అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈరోజు ధరలు తగ్గి వచ్చిన కూడా రేపటికి ఈ ధరలు ఎలా ఉంటాయో చూడాలి..