
ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పైకి కదిలాయి.. కానీ భారతీయ మార్కెట్ లో మాత్రం బంగారం భారీ పడిపోయింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 క్షీణించింది. దీంతో రేటు రూ.49,260 కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 350 పడిపోయింది. దీంతో ధర రూ.45,150కు చేరింది..
బంగారం ధరలు తగ్గినా, పెరిగినా అదే దారిలో వెండి ధర కూడా ఆధారపడి ఉంటుంది. కేజీ వెండి ధర రూ.71,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదల తో 1840 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.43 శాతం పెరుగుదల తో 27.03 డాలర్లకు చేరుకుంది. ఏది ఏమైనా ఈరోజు ధరలు ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో మహిళలు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.. మరో వారం రోజుల్లో బంగారం ధరలు 5 వేలకు పడిపోతాయని వార్త షికారు చేస్తోంది.