బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈరోజు మీ పంట పండినట్లే.. ఈరోజు ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత మూడు రోజులుగా కిందకు దిగి వస్తున్న బంగారం ధర ఈరోజు కూడా పడిపోయింది.
పసిడి రేటు దిగిరావడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే
వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. భారీగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం,
వెండి ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఈరోజు మహిళలకు కన్నుల పండుగనే చెప్పాలి..
అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు పడిపోవడం తో హైదరాబాద్ మార్కెట్ లో కూడా అదే విధంగా కొనసాగింది.. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం ధర వెలవెలబోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించింది. దీంతో రేటు రూ.48,820కు దిగొచ్చింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.44,750కు తగ్గింది. ఇక వెండి ధరలు అదే దారిలో నడిచింది.
బంగారం పైకి కదిలితే..
వెండి కూడా అదే విధంగా పయనించింది .ఈరోజు పైకి కదిలింది. కేజీ
వెండి ధర రూ.2,200 పైకి కదిలింది. దీంతో రేటు రూ.73,200కు ఎగసింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇకపోతే విదేశీ
మార్కెట్ లో ఈరోజు నమోదు అయిన ధరల విషయానికొస్తే... బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం క్షీణత తో 1833 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే
వెండి ధర కూడా ఇదే దారి లో నడిచింది. ఔన్స్‌కు 0.30 శాతం క్షీణతతో 26.81 డాలర్లకు పడిపోయింది. మరి ఈరోజు రేట్లు ఇలానే కొనసాగుతాయా లేదా మరుతాయా అనే అంశం చూడాలి..