బంగారం కొనాలని అనుకునేవారికి షాక్. ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. గత మూడు రోజుల క్రితం నేల చూపులు చూస్తున్న ధర ఈరోజు పైకి కదిలింది. బంగారం ధర క్రమంగా పైకి కదులుతోంది. ఈరోజు బంగారం ధర జిగేల్‌ మంది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారి లో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.అయినా కూడా దేశీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. పసిడి ప్రియులకు ఇది చేదు వార్తే..


ఈ రోజు బంగారం ధర విషయానికొస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పైకి కదిలింది. దీంతో రేటు రూ.48,710కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.590 పెరుగుదల తో రూ.44,650కు పెరిగింది. బంగారం ధరలపై ఆధారపడి వెండి ధరలు కొనసాగుతున్నాయి..



నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2100 పెరిగింది. దీంతో రేటు రూ.75,200కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఇకపోతే ఒకసారి  అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం తగ్గుదల తో 1837 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.21 శాతం తగ్గుదల తో 27.34 డాలర్లకు క్షీణించింది. ప్రస్తుతం పెరుగుతున్న ధరల వల్ల ఇక మీదట ధరలు పెరుగుతాయని తెలుస్తుంది. రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: