పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. నిన్నటి వరకు పైకి కదిలిన ధరలు ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు వెలవెలబోయింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదేదారిలో నడిచింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగిరావడంతో దేశీ మార్కెట్‌లోనూ రేట్లు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మొన్నటి వరకు ధరలు తగ్గాయి. మళ్లీ రెండు రోజులు ధరలు కొంచెం పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ధర కిందకు దిగి వస్తున్నాయి. నిన్నటి ధరతో పోలిస్తే ఈ రోజు ధర తగ్గింది. 



అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ ధర తగ్గింది. ఇకపోతే హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధరలు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 దిగొచ్చింది. దీంతో రేటు రూ.48,600కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. ధర రూ.200 క్షీణతతో రూ.44,550కు పడిపోయింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మరింత దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.1500 పతనమైంది. దీంతో రేటు రూ.72,900కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో ధర తగ్గిందని నిపుణులు అంటున్నారు.



అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గింది. ఒకసారి ధరలను చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1823 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.28 శాతం తగ్గుదలతో 26.97 డాలర్లకు చేరింది.బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళఙక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు... ఇక రేపటి రోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: