బంగారం కొంటున్నారా? అయితే మీ పంట పండినట్లే..  ఇవాళ ధరలకు బ్రేకులు పడ్డాయి. నిన్న కాస్త తగ్గిన ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా తగ్గింది.  ఈరోజు మహిళల ఆశలకు రెక్కలు వచ్చాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి.


హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,220కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 క్షీణతతో రూ.41,450కు దిగొచ్చింది.వెండి ధర కేజీకి రూ.500 పతనమైంది. దీంతో రేటు రూ.69,900కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ముఖ్య కారణం అని నిపుణులు అంటున్నారు.  


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1698 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 25.28 డాలర్లకు పడిపోయింది.
 ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశమన్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తత, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాల ప్రభావం వల్ల పసిడి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: