అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు నేడు కిందకు దిగి వచ్చాయి.. భారతీయ మార్కెట్లో కూడా తగ్గడం విశేషం. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. గత పది రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,100కు పైగా పతనమైంది. దీంతో రేటు రూ.45,220కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1,950 క్షీణతతో రూ.41,450కు పడిపోయింది..
బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. గత పది రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.5,100 పతనమైంది. దీంతో రేటు రూ.65,900కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విదేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 1735 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 26.87 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా రోజు బంగారు ధరలు తగ్గడం చూస్తుంటే ఈ నెల 30 వేలల్లోకి వచ్చేలా కనపడుతుంది.