
బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధర పరుగులు పెట్టడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.150 పెరుగుదలతో రూ.41,800కు ఎగసింది.
ఇప్పుడు బంగారం రేట్లను ఆధారంగా చేసుకొని వెండి ధర కూడా పైపైకి వస్తుంది. నిన్న కాస్త పెరిగిన కిలో వెండి ధర ఈరోజు మాత్రం అందరికీ షాక్ ఇస్తుంది.వెండి ధర కేజీకి రూ.300 పెరిగింది. దీంతో రేటు రూ.71,400కు ఎగసింది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో రేట్లు కూడా పెరిగాయని అంటున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 1722 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 26.12 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు తగ్గడం , పెరగడం కామన్ అయిపోయింది. మరి రేపటి రోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..