బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్.. నిన్నటివరకు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేటి మార్కెట్ లో ఆకాశాన్ని తాకాయి.బంగారం ధర పెరిగింది. పసిడి రేటు పైపైకి కదిలింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. ధలో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి.. మన దేశీయ మార్కెట్లో ఈరోజు రేటు కాస్త నిరాశను మిగిలిస్తుంది.. ఎంత ధరల్లో మార్పులు ఉన్నా కూడా మహిళలు మాత్రం బంగారాన్ని కొంటూనే ఉన్నారు.


ఇక హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.46,250కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.140 పెరుగుదలతో రూ.42,400కు పైకి కదిలింది.బంగారం ధర పైకి కదిలితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ అలానే కొనసాగడంతో ఇలా ధర పలుకుతుంది అని నిపుణులు అంటున్నారు..


అసలు విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 1741 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.21 శాతం క్షీణతతో 25.17 డాలర్లకు తగ్గింది.
ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు తదితర అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: