మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. ఇండియన్ మార్కెట్ లో కూడా బంగారం తగ్గడం గమనార్హం..హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.47,350కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 క్షీణతతో రూ.43,400కు పడిపోయింది. ఇక వెండి విషయానికొస్తే.. స్థిరంగా కొనసాగుతోంది.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.71,900 వద్దనే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1746 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.09 శాతం క్షీణతతో 25.40 డాలర్లకు చేరింది. బంగారం ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాయి..