హైదరాబాద్ మార్కెట్‌లో ఆదివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో రూ.48,860కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 క్షీణతతో రూ.44,800కు తగ్గింది.బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర రూ.200 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.74,100 కు దిగొచ్చింది.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 1737 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 25.17 డాలర్లకు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, ఆభరణాల తయారీ మొదలగు అంశాలు ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని నిపుణులు అంటున్నారు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..