బంగారం కొంటున్నారా? ఈరోజు మీ పంట పండినట్లే.. నిన్న వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేటి మార్కెట్ లో కిందకు వచ్చాయి. పసిడి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. కానీ ఇండియన్ మార్కెట్ లో మాత్రం భారీగా తగ్గడం గమనార్హం.. ఇది నిజంగానే ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. ఇకపోతే బంగారం ధర తగ్గితే.. వెండి ధరలు కూడా తగ్గాయి. జూన్ లో మాత్రం విపరీతంగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.


నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. ధర వెల వెల బోయింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గుదలతో రూ.48,650కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.210 క్షీణతతో రూ.44,590కు తగ్గింది..బంగారం ధర క్షీణిస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.300 తగ్గుదలతో రూ.74,000కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు..


ఇప్పుడు అందరూ బంగారం, రాగి వస్తువులను చేయికోడం కూడా వెండి ధరలు పడిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇకపోతే ఇంటర్ నేషనల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 1778 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైకి కదలింది. ఔన్స్‌కు 0.19 శాతం పెరుగుదలతో 26.12 డాలర్లకు ఎగసింది.ఇకపోతే గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: