పసిడి ధరలు మళ్ళీ షాక్ ఇస్తున్నాయి.. నిన్న కాస్త ఊరటను కలిగించిన ఈ ధరలు నేటి మార్కెట్ లో దూసుకు పోతున్నాయి.. నిన్న వరకు మార్కెట్ లో డిమాండ్ తగ్గడం వల్లనో, కరోనా సంక్షోభం వల్లనో ధరలు కిందకు దిగి వచ్చింది. ఆ వార్త ఒక్క రోజు కూడా ఉండకుండానే  భారీగా పెరిగింది. బంగారం ధర పైపైకి చేరింది. పసిడి పరుగులు పెట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం ఒక్కసారిగా పడిపోయింది.

ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరుగుదలతో రూ.44,300కు పెరిగింది.

ఎప్పుడు బంగారం ధరల పై ఆధారపడుతున్న వెండి.. నేటి మార్కెట్ లో కిందకు దిగి వచ్చింది. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర కేజీకి రూ.200 తగ్గుదలతో రూ.73,300కు క్షీణించింది. ఇందుకు కారణాలుగా వెండి వస్తువుల పై డిమాండ్ తగ్గడం లేదా పరిశ్రమల నుంచి వెండి నాణేల తయారీ నిలిచిపోవడం వంటి కారణాలుగా చెప్పవచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలను పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 1769 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 26.08 డాలర్లకు పెరిగింది. ఇకపోతే రేపటి మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: